బాలకృష్ణ తో ఎలాంటి విభేదాలు, శతృత్వం లేదు – నాగబాబు

Friday, May 29th, 2020, 11:28:19 AM IST


నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వం లో సినీ రంగానికి చెందిన పెద్దలు కేసీఆర్ తో పలు మార్లు చర్చలు జరిపారు. అయితే సినిమా చిత్రీకరణ, నిర్మాణ అనంతర పనుల కోసం లాక్ డౌన్ అనంతరం అనుమతి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ మోహన్ రెడ్డి నీ సైతం త్వరలో కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ నేపధ్యంలో బాలకృష్ణ ఈ చర్చల పై చేసిన వ్యాఖ్యలు వివాదం కాగా, దీని పై పలువురు ప్రముఖులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

పేపర్ లలో వచ్చే వరకు తనకు ఈ విషయం గురించి తెలియదు అని, ఇండస్ట్రీ కోసం జరుగుతున్న చర్చలను భూములు పంచుకుంటున్నారా అంటూ బాలయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన పై పలువురు ప్రముఖులు స్పందించారు. అయితే నటుడు నాగబాబు సైతం ఈ వివాదం పై స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.బాలకృష్ణ నోరు జారకుండా, అదుపులో పెట్టుకోవాలి అని, ఎవర్ని పిలవాలో, ఎవర్ని పిలవకూడదో కమిటీ కు తెలుసు అని నాగబాబు అన్నారు.

బాలయ్య చేసిన వ్యాఖ్యల పై నాగబాబు అసహనం వ్యక్తం చేశారు. అయితే నాగబాబు బాలయ్య పై చేసిన వ్యాఖ్యలకు ఒక వివరణ ఇచ్చారు. ఇండస్ట్రీ మి చెందిన పలువురు ప్రముఖులు హజరు అయిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ఫ్యామిలీ నుండి ఒకరిని పిలవాల్సిన అవసరం లేదా అని మీడియా విలేకరి అడగగా, నాగబాబు ఇలా స్పందించారు. బాలయ్యను కూడా చర్చలకు పిలిచి ఉండాల్సింది అని, బాలకృష్ణ తో ఎలాంటి విభేదాలు లేవని, ఎటువంటి శత్రుత్వం లేదు అని స్పష్టం చేశారు.ఆయన ప్రశ్నించ డం లో ఎలాంటి తప్పు లేదు అని, కాకపోతే భూములు పంచుకున్నారు అని అనడం మాత్రం సరైనది కాదు అని అన్నారు.