నాగ్ కి భారీ హిట్ ఇచ్చేందుకు సిద్దం అయిన ప్రవీణ్ సత్తారు!

Tuesday, July 28th, 2020, 02:34:09 AM IST


ఇండస్ట్రీ కి రొమాన్స్ లో, యాక్షన్ లో మాంచి హిట్స్ ఇచ్చిన కింగ్ నాగార్జున ప్రస్తుతం యువ హీరోలకు దీటుగా హిట్ చిత్రాలను చేయడం లేదు. ఇప్పటికీ తాను నమ్ముకున్న దారిలోనే వెళ్తున్నారు. బాలీవుడ్ లో బ్రహ్మ స్త్ర అనే చిత్రం లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు నాగ్. అంతేకాక వైల్డ్ డాగ్ అంటూ మరొక యాక్షన్ చిత్రాన్ని సైతం తెలుగులో చేస్తున్నారు. అయితే తాజాగా నేడు వచ్చిన ప్రకటన ప్రేక్షకులను, అభిమానులను ఆనందానికి గురి చేసింది.

గరుడ వేగ చిత్రం తో ఎన్నో ఏళ్లుగా ఫ్లాప్ లతో సతమత మవుతున్న రాజశేఖర్ కి ప్రవీణ్ సత్తారు హిట్ చిత్రాన్ని అందించారు. అదే దర్శకుడు ఇపుడు నాగ్ కు భారీ హిట్ ఇచ్చేందుకు సిద్దం అయ్యారు. నాగ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో ఇపుడు ఈ కాంబినేషన్ విషయం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరి కొన్ని వివరాలు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఈ చిత్రం అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా తెలుగు సినీ పరిశ్రమ లో చాలా సినిమాలు వాయిదా పడగా అందులో నాగ్ చిత్రం కూడా ఉంది. ఈ చిత్రం అనంతరం నాగ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న సినిమాలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.