సమంత నిజంగా తల్లి కాబోతుందా..!

Monday, June 10th, 2019, 05:47:24 PM IST

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నంబర్ వన్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది సమంత. అయితే ఈమె అక్కినేని నాగ చైతన్యను వివాహమాడి అక్కినేని కుటుంబంలో కోడలిగా కూడా అడుగుపెట్టింది. అయితే ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీ బిజీ జీవితాన్ని గడుపుతుంది. అయితే తాజాగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్‌, క్రాస్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్ నిర్మిస్తున్నాయి. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఓ బేబీ లో నాగశౌర్య హీరోగా సమంత హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో సీనియర్ నటి ల‌క్ష్మీ, రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాదద్‌లు కీలక పాత్రలో నటిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది. అయితే ఈ సినిమా ప్రచారంలో భాగంగా సమంత తన ట్విట్టర్ ఖాతాకు పేరు కూడా మార్చేసింది. అయితే ఈ సినిమా పేరు ఓ బేబీ కావడంతో తన ఖాతాకు బేబీ అక్కినేని అంటూ పేరు మార్చేసింది. అయితే సమంత అలా పేరు మార్చడంతో తల్లి కాబోతుందంటూ సోషల్ మీడియాలో ఆ వార్తను తెగ వైరల్ చేసేసారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో సమంత స్పందిస్తూ ఓ వెబ్‌సైట్ రాసిన కథనానికి ఘాటుగా సమాధానమిచ్చింది. సమంత తల్లి కాబోతుందా, ఈ విషయం తనకే తెలియదు మీకెప్పుడు తెలిసిందో కాస్త మాకు చెప్పండి అంటూ రీట్వీట్ చేసింది. సమంతా ఇలా అనడంతో తను తల్లి అయ్యే వార్తలు అవాస్తవమని , కేవలం బేబీ మూవీ ప్రమోషన్‌లో భాగంగా తాను తన ప్రొపైల్‌కి పేరు మార్చిందని క్లియర్‌గా అర్ధమవుతుంది.