త్రివిక్ర‌మ్ దెబ్బ‌కి బాగా హ‌ర్ట్ అయిన సునీల్.. మెయిన్ రీజ‌న్ తెలిస్తే..?

Friday, October 12th, 2018, 05:32:28 PM IST

టాలీవుడ్ బాక్సాఫీసును కుమ్మేస్తున్న అర‌వింద స‌మేత చిత్రం వంద‌కోట్లు దిశ‌గా అడుగులువేస్తుంది. ఇప్ప‌టికే విడుద‌ల అయితే తొలిరోజే నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను సొంతం చేసుకుని.. మ‌రిన్ని రికార్డులు వేట కొన‌సాగిస్తుంది. అయితే ఇక్క‌డ అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే అర‌వింద స‌మేత విడుద‌ల అయ్యాక .. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ మీద క‌మెడియ‌న్ సునీల్ హ‌ర్ట్ అయ్యాగ‌ని తెలుస్తోంది.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే త్రివిక్ర‌మ్, సునీల్ ఇద్ద‌రు మంచి స్నేహితులు అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. గ‌తంలో తిండి తిప్ప‌లు లేక అవ‌కాశాలు కోసం సినిమా ఆఫీసులు చుట్టూ తిరిగారు. ఇక బ్రేక్ వ‌చ్చాక త్రివిక్ర‌మ్, ముందు ర‌చ‌యిత గానూ.. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగాను టాప్ రేంజ్‌కి వెళ్ళాడు. ఇక మ‌రోవైపు సునీల్ స్టార్ క‌మెడియ‌న్‌గా స‌క్సెస్ అయ్యాక హీరోగా మారాడు.

ఇక హీరోగా మొద‌ట హిట్లు వ‌చ్చినా.. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ప్లాప్‌లు ప‌ల‌క‌రించ‌డంత‌తో ఒక్క‌సారిగా సునీల్ కెరీన్ రివ‌ర్స్ అయ్యింది. దీంతో త‌న స్నేహితుడి కెరీర్‌ను మ‌ళ్ళీ గాడిలో పెట్టాల‌ని త్రివిక్ర‌మ్.. అర‌వింద స‌మేత‌లో ఓ మంచి రోల్ ఇచ్చాడు. అయితే సినిమా మాత్రం హిట్ టాక్ సొంతం చేసుకున్నా సునీల్ పాత్ర‌కి మాత్రం పెద్ద‌గా ఆక‌ట్టుకో లేద‌ని.. అత‌ని సీన్లు కూడా ఎక్కువ‌గా లేవ‌ని.. దీంతో బెట‌ర్ లక్ నెక్ట్స్ టైమ్ సునీల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో త్రివిక్ర‌మ్ పై సునీల్ బాగా హ‌ర్ట్ అయ్యాడ‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.