నటుడు సూర్య పై కించపరిచే వ్యాఖ్యలు!

Friday, January 19th, 2018, 05:42:31 PM IST

ప్రముఖ మ్యూజిక్ ఛానల్ సన్ మ్యూజిక్ కి చెందిన ఇద్దరు యాంకర్లు నటుడు సూర్య పై కించపరిచే వ్యాఖ్యలు చేసిన విషయం ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది. ఆయన తాజా చిత్రం గ్యాంగ్ లో ఆయన చెప్పే ఒక డైలాగు వుంది. ‘నువ్వు ఎంత ఎత్తు వున్నావ్ అన్నది కాదు, ఎంత ఎత్తు ఎదిగావ్ అనేది ముఖ్యం’ అనేది ఆ డైలాగ్. ఈ డైలాగ్ ని ఉద్దేశించి ఆ ఛానల్ లో ప్రసారమయ్యే ఫ్రాంకా సొల్లాట అనే లైవ్ షో కార్యక్రమం లో ఆ యాంకర్లు సూర్య ఎత్తును గురించి అవహేళన చేస్తూ మాట్లాడారు. అమితాబ్ బచ్చన్ తో సూర్య నటించాలంటే కుర్చీ వేసుకుని మరీ నటించాలని, అదే సూర్య అమితాబ్ తో నటించాలంటే అప్పుడు అమితాబ్ కుర్చీలో కూర్చుని నటించాలని ఆయన్ని కించపరుస్తూ మాట్లాడారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తమిళ పరిశ్రమకు చెందిన వారు ఈ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ముఖ్యంగా దీనిపై రియాక్ట్ అయిన నటుడు విశాల్, ఈ మధ్య ప్రతివారికి కామెంట్ చేయడానికి సినిమావాళ్ళే దొరికారాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. అలానే గ్యాంగ్ చిత్ర దర్శకులు విగ్నేష్ శివన్ కూడా స్పందిస్తూ ఎన్నో వైవిధ్యమయిన పాత్రలకు పెట్టింది పేరైన అద్భుత నటుడు సూర్య అని, అటువంటి వ్యక్తి పై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు…