ఆ 59 చైనా యాప్స్ బ్యాన్ అయిన క్రెడిట్ మీకే దక్కుతుంది సార్ – అనసూయ భరద్వాజ్!

Tuesday, June 30th, 2020, 02:40:35 PM IST

కొన్ని కోట్ల భారత ప్రజలు వాడుతున్న 59 చైనా అప్లికేషన్ లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ 59 అప్స్ బ్యాన్ కావడానికి పూర్తి క్రెడిట్ సోనమ్ వాంగ్ చుక్ దే నని నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. సోనమ్ వాంగ్ చుక్ చేసిన పోస్ట్ కి అనసూయ భరద్వాజ్ స్పందించారు.

భారత ఇంజినీర్ అయిన సోనమ్ వాంగ్ చుక్ ఈ 59 అప్స్ కి సంబంధించిన ఒక పోస్ట్ పెట్టారు. మీడియా ఛానెల్స్ నుండి తనకు విపరీతంగా కాల్స్ వస్తున్నాయి అని, అందుకు తాను రాంగ్ నెంబర్ అంటూ సమాధానం ఇస్తున్నా అని వ్యాఖ్యానించారు. అయితే ఈ అప్లికేషన్ లు బ్యాన్ అవ్వడానికి గల కారణం భారతీయులే అని వ్యాఖ్యానించారు. ఏదైనా క్రెడిట్ ఉంటే అది ఖచ్చితంగా కోట్ల మంది భారతీయులకు మరియు భారత్ ప్రభుత్వానికి చెందుతుంది అని వ్యాఖ్యానించారు. అందుకు ప్రతిస్పందిస్తూ అనసూయ ఇలా అన్నారు. కానీ దీన్ని ప్రారంభించి నందుకు గానూ క్రెడిట్ మీకే దక్కుతుంది. మీరు భారతీయులను మోటివేట్ చేసినందుకు చాలా గర్వ పడుతున్నాం అని అనసూయ భరద్వాజ్ తెలిపారు.