నెటిజెన్ ని బండబూతులు తిట్టిన నటి మాధవీలత

Tuesday, February 11th, 2020, 09:07:21 AM IST

సోషల్ మీడియా లో సెలెబ్రిటీలని సైతం ప్రస్తుతం వేధింపులకు గురి చేస్తున్నారు కొంతమంది పోకిరి గాళ్ళు. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ లలో ఇది చాల ఎక్కువగా ఈ మధ్య కనిపిస్తుంది. అయితే ఈ లాంటి సమస్యనే అనసూయ ఎదుర్కోవడం తో అనసూయ సైబర్ క్రైమ్ ని ఆశ్రయించడం జరిగింది. తాజాగా ఇపుడు నటి మాధవీలత కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.

సోషల్ మీడియా లో పర్సనల్ విషయాల తో పాటుగా సోషల్ ఇష్యూ స్ ఫై కూడా నటి మాధవీలత స్పందిస్తూ ఉండటం మనం చూస్తున్నాం. అయితే సోషల్ మీడియా లో సెలెబ్రిటీ ల ఫై ట్రోల్ చేయడం పట్ల మాధవీలత తన ఒపీనియన్ ని తెలియజేసారు. అయితే వీటిపై స్పందించిన ఒక నెటిజెన్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. “ఎవరైనా బీజేపీ వాళ్ళు దీన్ని రేప్ చేసి చంపేస్తే దరిద్రం వదిలిపోద్ది ” అని అన్నాడు.

దానికి బదులుగా మాధవీలత ఆగ్రహం తో “ఇలాంటి లుచ్చా లంగా కొడుకులని ఏం చెయ్యాలి. కోసి పారెయ్యాలిగా, ఏం చూసుకొని మగాడని ఫీల్ అవుతున్నాడో, వీడి బ్రెయిన్ ఎంత నీచంగా ఉందొ,ఏమనాలి ఇలాంటి పుండాకోర్ ముండాగాళ్లని” నువ్వే డిసైడ్ చెయ్ అని ఫైర్ అయ్యారు.