వాళ్ల కష్టాలు రామ్ కి వరాలు !

Friday, October 27th, 2017, 03:54:52 AM IST

అద్భుతమైన బజ్ తో హీరో రామ్ నటించిన ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. షూటింగ్ మొదలైనప్పటి నుంచి చాప కింద నీరులా అన్నీ పనులు పూర్తి చేసిన రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ రిలీజ్ కు సిద్ధం అయిపోయాడు. కిషోర్ తిరుమల – రామ్ లది హిట్ కాంబినేషన్ కావడం, ఇద్దరు హీరోయిన్లతో సినిమాకి కలర్ ఫుల్ లుక్ రావడంతో ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. చివరగా దేవి కంపోస్ చేసిన పాటలకు, ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీనితో అంచనాలు కాస్త ఆకాశాన్ని తాకేశాయి.

దీనితో రామ్ కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ ని ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సాధించడం ఖాయమనే అభిప్రాయం ఏర్పడింది. ఈ చిత్రానికి పోటీగా తమిళ హీరో విజయ్ మెర్సల్ చిత్రం విడుదల కావలసి ఉంది. తమిళ్ లో విజయ్ పెద్ద స్టార్ అయినా తెలుగులో మాత్రం కాదు. దీనితో మెర్సల్ చిత్ర ప్రభావం ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ పై ఉండదని అంతా భావించారు. కానీ తమిళ్ లో విడుదలయ్యాక ఈ చిత్రం నానా భీభత్సం సృష్టిస్తోంది. జీఎస్టీ గురించి కాట్రవర్షియల్ కంటెంట్ ఉండడంతో మెర్సల్ కు మరింత ప్రచారం ఏర్పడింది. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారడంతో తెలుగు ప్రేక్షుకులకు కూడా ఈ చిత్రం చూడాలనే ఆసక్తి పెరిగింది.

ఈ నేపథ్యంలో ఉన్నది ఒక్కటే జిందగీ కి, తెలుగులో ‘అదిరింది’ గా రాబోతున్న మెర్సల్ కి ఎంతో కొంత పోటీ ఉంటుందని భావించారు. కానీ చివరి నిమిషంలో ‘అదిరింది’ తప్పుకుంది. తెలుగు సెన్సార్ విషయంలో ఈ చిత్రానికి చిక్కులు ఏర్పడ్డాయి. అనూహ్యంగా ‘అదిరింది’ వాయిదా పడడం ‘ఉన్నది ఒక్కటే జిందగీ’కి కలసి వచ్చే అంశం. టాక్ బావుంటే వారం రోజుల పాటు రామ్ దున్నేసుకోవచ్చన్నమాట.

  •  
  •  
  •  
  •  

Comments