న‌వాబ్ బ్యూటీ చెల‌రేగిపోయిందే!

Tuesday, October 2nd, 2018, 06:55:40 PM IST

అదితీరావ్ హైద‌రీ.. ప్ర‌స్తుతం బాలీవుడ్‌తో పాటు, కోలీవుడ్‌, టాలీవుడ్ లోనూ ఈ భామ హాట్ టాపిక్‌. వ‌రుస స‌క్సెస్‌ల‌తో అదితీ జోరు మీద ఉంది. ఆ క్ర‌మంలోనే సౌత్‌లో ఈ అమ్మ‌డి పేరు మార్మోగిపోతోంది.

అతిదీరావ్ హైదరీ ఇటీవ‌ల వ‌రుస‌గా భారీ చిత్రాల‌తో ప్రేక్ష‌కాభిమానుల్ని అల‌రిస్తోంది. అప్ప‌ట్లో ప‌ద్మావ‌త్ చిత్రంలో ఖిల్జీ మోహించే రాజ‌కుమారి పాత్ర‌లో న‌టించి మెప్పించిన అదితీరావ్ ఆ త‌ర్వాత సుధీర్ బాబు స‌ర‌స‌న స‌మ్మోహ‌నం చిత్రంలో న‌టించి మెప్పించింది. ఇటీవ‌లే రిలీజైన న‌వాబ్ చిత్రంలోనూ అదితీ పాత్ర‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. మ‌ణిర‌త్న ం దర్శ‌క‌త్వ ం వ‌హించిన ఈ చిత్రంలో అదితీలోని రొమాంటిక్ యాంగిల్‌ని పీక్స్‌లో చూపించారన్న పొగ‌డ్త ద‌క్కింది. అర‌వింద స్వామి చిన్న ఇంటికి వెళ్లి వ‌స్తున్నారంటే అంత‌టి రొమాంటిక్ వైఫ్ ట్రీట్ ఉంద‌నే కోణంలో … కార్పొరెట్ గురువులు రెండో ఇల్లు సంగ‌తులు అదితీ పాత్ర‌లో ఎలివేట్ చేశారు. న‌వాబ్ త‌మిళంలో బంప‌ర్ హిట్ కొట్టింది. ఆ క్ర‌మంలోనే అదితీకి వ‌రుస‌గా ప‌లు భారీ సినిమాల్లో అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయ‌ని తెలుస్తోంది. మొత్తానికి బాలీవుడ్ తో పాటు ఇటు సౌత్‌లోనూ అదితీ బిజీ అయిపోతోంది. అదితీ లేటెస్ట్ గా హ‌లో మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌షూట్‌లో పాల్గొన్న ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో వేడి పెంచుతున్నాయ్‌.