ఆకట్టుకుంటున్న అడివి శేష్ మేజర్ టీజర్!

Monday, April 12th, 2021, 05:50:46 PM IST

భిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరించడానికి పరి తపిస్తూనే ఉంటాడు హీరో అడివి శేష్. అయితే ఈసారి మాత్రం దేశ భక్తి చిత్రం మన ముందుకు రానున్నాడు. అడివి శేష్ నటిస్తున్న మేజర్ చిత్రం కి సంబంధించిన టీజర్ తాజాగా విడుదల అయింది. అయితే ముంబై దాడుల్లో ఉగ్ర మూకల్ని మట్టుపెట్టి అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ను దర్శకుడు శశికిరన్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రాన్ని మూడు భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే తాజాగా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో చిత్ర టీజర్ విడుదల అయింది.

అయితే మన ఆర్మీ బోర్డర్ లో ఎలా ఫైట్ చేయాలి, ఇండియా క్రికెట్ మ్యాచ్ ఎలా గెలవాలి అని ఆలోచిస్తారు అది దేశ భక్తే అంటూ అడివి శేష్ వాయిస్ తో ఉన్నటువంటి డైలాగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం తెలుగు టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు, హిందీ టీజర్ ను బాలివుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, మలయాళ టీజర్ ను పృథ్వీరాజ్ లు విడుదల చేశారు. అయితే ఈ సినిమా టీజర్ పై ప్రముఖులు, అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 2 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

టీజర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి