పవన్ అయ్యిపోయాడు ఇక చిరు టార్గెట్ రజినీయే.!

Wednesday, March 25th, 2020, 04:46:55 PM IST

టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి మారుతున్న రోజులకు అనుగుణంగా తమ అభిమానులతో మరియు ప్రపంచానికి మరింత దగ్గరగా ఉండేందుకు సోషల్ మీడియాలోకి కూడా వచ్చారు. మొన్ననే ఇంస్టాగ్రాంలో తన ఖాతాను ఓపెన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈరోజు మరో మాధ్యమం ట్విట్టర్ లోకి అడుగు పెట్టగా అక్కడ కూడా మెగాస్టార్ కు మాసివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ ఖాతా ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే రికార్డు స్థాయి ఫాలోవర్స్ ను రాబట్టేసారు.మన తెలుగు మరియు మొత్తం భారతదేశంలోనే ట్విట్టర్ అకౌంట్ మొదలు పెట్టిన 24 గంటల్లో అత్యధిక ఫాలోవర్స్ ను రాబట్టిన హీరోల జాబితాలో తమిళ్ తలైవర్ రజినీ కాంత్ 2 లక్షల 15 వేల ఫాలోవర్స్ తో ముందంజలో ఉండగా..

ఆ తర్వాత స్థానంలో తెలుగు హీరోల నుంచి మొదటి స్థానంలో చిరు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 91 వేల మందితో ఉన్నారు.అయితే ఇప్పుడు మెగాస్టార్ కేవలం 6బి గంటల్లోనే 76 వేల మందికి పైగా ఫాలోవర్స్ ను రాబట్టేసారు అంటే పవన్ ను దాటెయ్యడం పెద్ద కష్టమేమి కాదు సో ఇక మిగిలి ఉంది రజినియే మరి 24 గంటల్లో మెగాస్టార్ రజినీని దాటేస్తారో లేదో చూడాలి.