సూపర్ స్టార్, పవర్ స్టార్ తర్వాతి స్థానం మెగాపవర్ స్టార్ దే!

Saturday, March 3rd, 2018, 03:15:48 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ లో వున్న బిగ్ టాలీవుడ్ పిల్లర్స్ అని చెప్పాలి. వీరి చిత్రాలు విడుదలవుతుంటే మనకు ఒక పెద్ద పండుగ వచ్చిన వాతావరణం కనపడుతుంటుంది. నిజానికి మెగా స్టార్ చిరంజీవి తరువాత మొద స్థానానన్ని ఈ ఇద్దరిలో ఎవరికి దక్కుతుంది అంటే ఖచ్చితంగా చెప్పడం కష్టమే. అలా ఎవరి కెరీర్ తో వారు ముందుకు దూసుకెళ్తున్నారు.

మరి అయితే ఇంకా జూనియర్ యన్టీఆర్, బన్నీ, ప్రభాస్ వంటి నటులుండగా రాంచరణ్ మాత్రమే తర్వాతి స్థానానికి ఎందుకు వస్తాడా అనుకోకండి. మనం ప్రస్తుతం మనం మాట్లాడుకునేది హీరో ల పొజీషన్ ల గురించి కాదండోయి. ఇటీవల విడుదలయి మోత మ్రోగిస్తున్న రామ్ చరణ్ నటించిన రంగస్థలం పాటల విషయం. ఈ సినిమా ఆడియో రైట్స్ 1.6 కోట్లకు అమ్ముడు పోయి నాన్ బాహుబలి లిస్ట్‌లో టాలీవుడ్‌లో ఈ స్థాయిలో అమ్ముడుపోయిన చిత్రాలలో మూడో స్థానంలో నిలిచింది.

ఈ చిత్రం కంటే ముందు మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ 2 కోట్లు, పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ 2 కోట్లతో 1, 2 స్థానాలను ఆక్రమించుకున్నాయి. కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ‘రంగస్థలం’ చిత్రంలోని రెండు పాటలు ఇప్పటికే విడుదలై సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తుంటే, ఆడియో రైట్స్ రూపంలో కూడా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసి, టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. కాగా సెన్సషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వేసవి కానుకగా మార్చి 30న ప్రపంచవ్యాప్తం గా విడుదల కానుంది……..