అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన ఆహుతి ప్రసాద్!

Tuesday, December 16th, 2014, 02:32:12 PM IST

Ahuti-Prasad
ప్రముఖ టాలీవుడ్ క్యారెక్టర్ నటుడు ఆహుతి ప్రసాద్ సోమవారం ఆనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. కాగా కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆహుతి ప్రసాద్ ఆరోగ్యం ఎంతకీ కుదుటపడక పోవడంతో కిమ్స్ లో చేరారు. ఇక ఆహుతి ప్రసాద్ సొంత ఊరు కృష్ణాజిల్లాలోని ముదినేపల్లి పక్కన ఉన్న కోడూరు. ఆయన అసలు పేరు జనార్ధన వరప్రసాద్. కాగా ‘చందమామ’ సినిమాకు గాను ఆయన బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నందితో పాటు గుమ్మడి అవార్డు కూడా అందుకున్నారు. అంతేగాక గులాబీ, నిన్నే పెళ్ళాడతా, కొత్తబంగారులోకం, బెండు అప్పారావు, సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం తదితర చిత్రాల్లో మంచి పాత్రలను పోషించారు.