ఐశ్వర్యా, ఆరాధ్య కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు – అభిషేక్ బచ్చన్!

Monday, July 27th, 2020, 09:18:09 PM IST


కరోనా వైరస్ భారిన పడిన ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ఎట్టకేలకు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన భార్య ఐశ్వర్యా రాయ్ బచ్చన్ మరియు ఆరాధ్య కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు అని, వారికి మళ్లీ జరిపిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలలో నెగటివ్ వచ్చిన విషయాన్ని వెల్లడించారు. అంతేకాక వారు ఇద్దరూ కూడా ఇపుడు ఇంట్లో ఉన్నారు అని వ్యాఖ్యానించారు. అయితే తన తండ్రి అమితాబ్ బచ్చన్, తాను ఇంకా ముంబై లోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాము అని అన్నారు.

అయితే గత కొద్ది రోజుల క్రితం అభిషేక్ బచ్చన్, అమితాబ్ లకు కరోనా సోకగా, ఇంట్లో కుటుంబ సభ్యులకు సైతం కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా ఐశ్వర్యా, ఆరాధ్య లకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది, అమితాబ్ భార్య జయా బచ్చన్ కి కరోనా నెగటివ్ అని తేలింది. అయితే నేడు సోషల్ మీడియా వేదిక ద్వారా అభిషేక్ బచ్చన్ తన భార్య, కూతురు ఆరాధ్య కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.