రోబో 2. 0 లో ఐశ్వర్య రాయ్ ?

Thursday, April 5th, 2018, 10:31:24 PM IST

బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్య రాయ్ తాజాగా సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా నటిస్తున్న రోబో 2. 0 సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రజనితో కలిసి ఐష్ .. రోబో సినిమాలో నటించింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. తాజగా ఆ సినిమాకు సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఐష్ గెస్ట్ పాత్రలో కనిపిస్తుందట. నిజానికి ఇన్ని రోజులు ఈ విషయాన్నీ గోప్యాంగా ఉంచారు .. కానీ తాజగా ఈ విషయం బయటకు లీక్ అయింది. రోబో సీక్వెల్ కావడంతోనే కావాలనే ఐష్ ని నటింప చేసినట్టు టాక్ . అయితే ఐష్ ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటుంది. చిత్రాన్ని జూన్ లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments