సంక్రాంతిపైనే అజిత్ విశ్వాసం ?

Friday, June 29th, 2018, 03:52:19 AM IST

తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా నటిస్తున్న విశ్వాసం సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూరయినా ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారట. వివేకం, వేదలమ్, లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న అజిత్ – శివ ల కాంబినేషన్ లో వస్తున్నా ఈ సినిమాకు అటు బిజినెస్ పరంగా కూడా భారీ హైప్ నెలకొంది. నిజానికి ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలనీ అనుకున్నారు .. కానీ షూటింగ్ అనుకున్న స్థాయిలో జరగలేదు కాబట్టి .. సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారట. తమిళ తాలా గా మంచి క్రేజ్ తెచ్చుకున్న స్టార్ అజిత్ అంటే కోలీవుడ్ లో ఏ రేంజ్ లో ఇమేజ్ ఉందొ కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.