అజిత్ సినిమా హక్కులపై భారీ విశ్వాసం ?

Tuesday, October 9th, 2018, 07:56:57 PM IST

తమిళ స్టార్ హీరో అజిత్ తాజా చిత్రం విశ్వాసం . శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తీ కావొచ్చింది. వీరం, వేదాళం , వివేగం సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేయడంతో ఈ సినిమా బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయట. అజిత్ – శివ కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకంగా 50 కోట్లకు ఈ హక్కులను సొంతం చేసుకుందట. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ లో ఆసక్తి రేపుతోంది. వచ్చే సంక్రాంతికి భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.