అఖిల్ వేటెంటైన్స్ డే కానుక‌

Thursday, October 11th, 2018, 12:29:55 PM IST

అక్కినేని అఖిల్ న‌టిస్తున్న తాజా చిత్రం `మిస్ట‌ర్ మ‌జ్ను`. `స‌వ్యాసాచి` ఫేం నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌. `తొలి ప్రేమ‌` ఫేం వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు. ఇటీవ‌లే విడుద‌ల చేసిన టైటిల్ లుక్‌, టీజ‌ర్ ఆక‌ట్టుకున్నాయి. గాళ్స్‌తో అఖిల్ రోమియో అప్పియ‌రెన్స్ అక్కినేని బ్రాండ్‌కి సింబాలిక్ అన్న టాక్ వినిపించింది. మొత్తానికి మూడో సినిమాతో అక్కినేని బుల్లోడు హిట్ కొట్టేట్టు ఉన్నాడ‌న్న పాజిటివ్ టాక్ వినిపించింది.

అయితే ఈ సినిమా రిలీజ్ విష‌య‌మై ఇప్ప‌టికీ బోలెడ‌న్ని సందేహాలు నెల‌కొన్నాయి. వాస్త‌వానికి కింగ్ సెంటిమెంటు ప్ర‌కారం డిసెంబ‌ర్‌లో క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ్ చేయాల‌ని భావించినా అప్పుడు కుద‌ర‌లేదు. దాంతో సంక్రాంతి బ‌రిలో రిలీజ్ చేయాల‌ని అక్కినేని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. కానీ అప్పుడు ఠ‌ఫ్ కాంపిటీష‌న్ ఎదుర్కోవాల్సిన స‌న్నివేశం ఉంది. నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న `ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు` , రామ్‌చ‌ర‌ణ్ – బోయ‌పాటి కాంబినేష‌న్ మూవీ ఆర్‌సి 1, విక్ట‌రీ వెంక‌టేష్ – వ‌రుణ్ తేజ్ – అనీల్ రావిపూడి చిత్రం `ఎఫ్ 2- ఫ‌న్ & ఫ్ర‌స్టేష‌న్` , త‌ళా అజిత్ `విశ్వాసం` సంక్రాంతి బ‌రిలో నిలిచాయి. దీంతో పోటీ ఠ‌ఫ్‌గా ఉంద‌న్న మాటా వినిపిస్తోంది. ఆ క్ర‌మంలోనే జ‌న‌వ‌రిలో రిప‌బ్లిక్ డే కానుక‌గా రిలీజ్ చేయనున్నార‌న్న మాటా వినిపించింది. అయితే అప్పుడు ఎన్టీఆర్ – మ‌హానాయ‌కుడు (పార్ట్ 2) రిలీజ‌వుతోంది. ఈ గంద‌ర‌గోళం న‌డుమ రిలీజ్ స‌రికాద‌ని భావించిన మిస్ట‌ర్ మ‌జ్ను టీమ్ ఫిబ్ర‌వ‌రి 14న వేటెంటైన్స్ డే కానుక‌గా రిలీజ్ చేస్తే బావుంటుంద‌ని ఆలోచిస్తోందిట‌. మొత్తానికి ప్రేమికులంద‌రికీ అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాల‌ని అఖిల్ భావించిన‌ట్టే క‌నిపిస్తోంది. ఈ రిలీజ్ తేదీ.. మూవీ కంటెంట్‌కి సూట‌బుల్ అన్న మాట వినిపిస్తోంది. అయితే కొత్త తేదీని అఖిల్ టీమ్ క‌న్ఫామ్ చేయాల్సి ఉంటుంది.