సాహొపై పోటీకి సై అంటున్న మరో సినిమా..!

Friday, June 14th, 2019, 03:59:39 PM IST

బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత అగ్ర హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న భారీ ఆక్షన్ ఎంటర్టైనర్, స్పై థ్రిల్ల‌ర్ మొవ్వీ సాహో. అయితే దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే తాజాగా నిన్న విడుదలైన టీజర్ కూడా అంచనాలను మించి ఉండడంతో అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. టీజర్‌లో కనిపించిన యాక్షన్ సన్నివేశాలు, చేజింగ్ సీన్స్, గన్ ఫైరింగ్స్ వంటివి చూస్తుంటే వళ్ళు గగుర్పుడిచేలా ఉంది. అయితే ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని ఆగష్ట్ 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా తెలుగు, త‌మిళం, హిందీ , మ‌ల‌యాళంతో పాటు ప‌లు భాష‌ల‌లో రిలీజ్ చేయబోతున్నారు.

ఇదిలా ఉండగా సాహో వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని ఢీకొట్టే చిత్రం ఏది రాలేదని భావిస్తున్న సినిమా విశ్లేషకులకు అనూహ్యంగా సాహోపై మేము పోటీకీ రెడీ అంటూ సవాల్ విసిరి మరీ రాబోతుంది ఓ బాలీవుడ్ సినిమా. బాలీవుడ్ ప్రముఖ హీరో అక్ష‌య్ కుమార్ నటిస్తున్న మిష‌న్ మంగ‌ల్‌ సినిమాతో సాహోకు పోటీగా దిగుతున్నాడు. ఈ సినిమాలఓ సోనాక్షి సిన్హా, విద్యాబాలన్‌, నిత్యామీనన్‌, తాప్సీ, కృతి కుల్హ‌రీ, ష‌ర్మ‌న్ జోషి లాంటి ఫేమస్ హీరోయిన్‌లు ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. స్పేస్ చిత్రంగా రూపొందుతున్న మిషన్‌ మంగళ్‌ చిత్రాన్ని సాహోకు పోటీగా ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే ఈ సినిమాను గత ఏడాది న‌వంబ‌ర్‌లో షూటింగ్ మొదలు పెట్టరు. మరికొద్ది రోజుల్లో ఈ చిత్రం కూడా షూటింగ్ పూర్తి చేసుకోనుంది. అయితే ఇలాంటి భారీ చిత్రాలు ఒకే రోజు విడుదల కానుండడంతో కథ మరియు కలెక్షన్ల పరంగా పోటీని తట్టుకుని ఏ సినిమా నిలబడుతుందో వేచి చూడాలి మరీ.