ఊహించని టైంలో “అల వైకుంఠపురములో” టీజర్.?

Thursday, October 17th, 2019, 08:22:09 PM IST

ఇప్పుడు అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో “అల వైకుంఠపురములో” అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే.మూడోసారి ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ వస్తుండడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.అంతే కాకుండా ఈ మధ్యన విడుదల చేస్తున్న పోస్టర్లకు కానీ ఫస్ట్ సింగిల్ కు కానీ అదిరిపోయే రెస్పాన్స్ వస్తున్నాయి.అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ పై సినీ వర్గాలలో లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

ఇప్పటికే ఎంతో మంది ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ టీజర్ ను అనుకోని టైం లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.అయితే ఇప్పటికే ఈ సినిమా సెకండ్ సింగిల్ ను దీపావళికి విడుదల చేస్తునట్టు తెలుస్తుంది.అందువలన ఈ సినిమా టీజర్ దీపావళికి రాకపోవచ్చు.దీనితో ఈ టీజర్ ను ఆ తర్వాత నవంబర్ 2న కానీ ఆ మొదటి వారంలో కానీ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.మరి ఈ టీజర్ ఎప్పుడు వస్తుందో చూడాలి.ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉంది.