“అల వైకుంఠపురములో” టీజర్ పర్ఫెక్ట్ రివ్యూ..!

Wednesday, December 11th, 2019, 04:42:49 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “అల వైకుంఠపురములో” సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.బన్నీ మరియు త్రివి కాంబో తెరకెక్కుతున్న మూడవ సినిమా కావడం దానికి తోడు ఓ భారీ డిజాస్టర్ నుంచి తేరుకొని అదిరిపోయే హిట్టు అందుకున్నాక గురూజీ అదే కంటిన్యు చేస్తారేమో అని అనుకోవడం అలాగే సాంగ్స్ పరంగా మంచి హైప్ వచ్చి అవి హిట్టవ్వడం వంటివి ఈ చిత్రంపై అంచనాలు పెంచేసాయి.అలా అన్ని చూసి ఇక టీజర్ కోసం అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసారు.అలా ఎన్నో అంచనాల నడుమ ఈరోజు ఈ సినిమా టీజర్ తాజాగా విడుదల అయ్యింది.ఇక ఈ టీజర్ ఎలా ఉంది దానిలో ఫ్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మొదటగా ప్లస్ పాయింట్స్ :

మొదటగా టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థమన్ అందించిన బ్యాక్ స్కోర్ అయితే చాలా క్యాచీగా హై ఎండ్ మోడ్ లో ఉంది.అలాగే అల్లు అర్జున్ లుక్స్ అయితే వింటేజ్ లుక్స్ ను తలపించాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.దానికి తోడు యాక్షన్ సీన్స్ తర్వాత “స్టైల్ గా ఉంది కదా” అని బన్నీ చెప్పిన డైలాగ్ మాత్రం ఫ్యాన్స్ కు మాంచి కిక్కిస్తుంది.అలాగే పూజా మరియు బన్నీల మధ్య కెమిస్ట్రీని గురూజీ కాస్త కొత్తగా ఆవిస్కహరించేలా ఉన్నారనిపిస్తుంది.అలాగే ఫైనల్ గా కోలీవుడ్ విలక్షణ నటుడు సముద్రకని తో “మీరిప్పుడే కార్ దిగారు నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కాను” అని పేల్చిన డైలాగ్ క్లాస్ లోనే మాస్ ఉంటే ఎలా ఉంటుందో చూపించింది.అలాగే లాస్ట్ బట్ లీస్ట్ సంక్రాంతి పుంజును పట్టుకొని సిగరెట్ వెలిగించి సంక్రాంతికి పందెంకి రెడీ అన్నట్టుగా గురూజీ చూపించిన ఈ సీన్ కి థియేటర్ లో ఫ్యాన్స్ చొక్కాలు చించుకుంటారు అని చెప్పొచ్చు.

ఇప్పుడు మైనస్ పాయింట్స్ :

తెలుగు సినిమాలను బాగా ఫాలో అవుతున్న వారికి అయితే ఈ టీజర్ చూసిన మొదటి 30 సెకండ్లకే మరో “అజ్ఞ్యాతవాసి” మాత్రం కాకూడదు అని మనసులో అనుకొనే ఉంటారు.బన్నీను దాచి ఉంచామని చెప్పడం ఆ ప్లాట్ లైన్ కి బాగా దగ్గరగా సూచిస్తుంది.అలాగే ఆఫీస్ లో బన్నీ యాటిట్యూడ్ మరియు టేబుల్ పై నుంచి నడుస్తూ రావడం ఆ ఆఫీస్ వాతావరణం అంతా “అజ్ఞ్యాతవాసి” సినిమాలోని ఆఫీస్ ఎపిసోడ్స్ నే తలపిస్తుంది.49వ సెన్ద్ దగ్గర అయితే సునీల్,హర్ష వర్ధన్ మరియు మరో లేడీ పాత్ర వచ్చి చూసిన సీన్ అయితే అజ్ఞ్యాతవాసి లోని వర్మ,శర్మలను గుర్తు చేస్తుంది.

గురూజీ సినిమాలో అలా ఉండకుండా వేరే విధంగా చూపిస్తేనే బెటర్ .లేకపోతే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏర్పర్చుకున్న అంచనాలు అన్ని తల కిందులు అవుతాయి.అంతే కాకుండా మరో ముఖ్యమైన మైనస్ పాయింట్ ఏమిటంటే ఈ చిత్రంలోని కీలకమైన లైన్ లేటెస్ట్ గా విడుదల కాబోతున్న మరో పెద్ద సినిమాలనే ఉంటుందని ఊహాగానాలు కూడా ఉన్నాయి.అదే కానీ నిజమైతే మరింత దెబ్బ పడే అవకాశం ఉంది.దానిని బట్టి త్రివిక్రమ్ ఎలా ప్లాన్ చేసారో సినిమా చూసేంత వరకు తెలియకపోచ్చు.కేవలం డైలాగ్స్ మాత్రమే సినిమాను గట్టెక్కించలేవు సరైనది కాకపోయినా తెలియని కథను చూపెడితేనే కాస్త బెటర్ కానీ ఆ అవకాశం అయితే “అల వైకుంఠపురములో” లేనట్టు అనిపిస్తుంది.

ఇక ఫైనల్ గా :

ఓకె..పర్లేదు.బట్ గురూజీ “అజ్ఞ్యాతవాసి” నుంచి బయట పడ్డారో లేదో తెలియాలంటే విడుదల వరకు ఆగక తప్పదు.