ఓవర్సీస్ లో దంచుతున్న “అల వైకుంఠపురములో”

Tuesday, January 14th, 2020, 06:55:49 PM IST

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఏ చిత్రానికి లేని విధంగా ఒక సినిమా ఓవర్సీస్ మార్క్ట్ లో దుమ్ము దులుపుతుంది.అసలు బన్నీ కు ఎక్కడైతే మార్కెట్ లేదు అన్నారో అలాంటి వారందరికీ “అల వైకుంఠపురములో” చిత్రంతో సమాధానం ఇచ్చేసారు.త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం మన దగ్గర కంటే కూడా ఓవర్సీస్ లో ముఖ్యంగా యూఎస్,కెనడా మరియు ఆస్ట్రేలియాలలో అదిరిపోయే వసూళ్లను రాబడుతుంది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

అంతే కాకుండా మాములుగా ప్రీమియర్స్ నుంచే కాకుండా ఆ తర్వాత రోజు నుంచీ నాన్ బాహుబలి 2 వసూళ్లను రాబట్టడం గమనార్హం.శనివారం ప్రీమియర్స్ కాకుండా ఆదివారం మరియు సోమవారం కూడా “అల వైకుంఠపురములో” చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో స్ట్రాంగ్ గా నిలబడినట్టు తెలుస్తుంది.దీనితో ఫుల్ రన్ లో మాత్రం “అల వైకుంఠపురములో” చిత్రం మంచి లాభాల్లో తేలడం ఖాయం అని చెప్పాలి.