అలవైకుంఠపురంలో: రాములో రాములా మాస్ సాంగ్..!

Sunday, October 20th, 2019, 09:10:10 PM IST

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న చిత్రం అల వైకుంఠపురములో. 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని హారిక మరియు హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సీనియర్ నటి టబు, నవదీప్, మురళి శర్మ, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే అల్లు అరవింద్‌, ఎస్‌. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుందని సమాచారం. అయితే ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో యువ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన సాఫ్ట్ అండ్ మెలోడీ సాంగ్ సామజవరగమన మంచి క్రేజ్‌ను సంపాదించింది. అయితే ఈ చిత్రబృందం ఇప్పుడు ‘రాములో రాములా’ అంటూ పక్కా మాస్ బీట్ ని బయటకు వదలడానికి రెడీ అవుతుంది. అయితే రేపు సాయంత్రం 4.05 గంటలకు ఈ సాంగ్ యొక్క టీజర్‌ను విడుదల చేయనున్నట్లు బన్నీ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయితే ఈ పాట అందరికి నచ్చుతుందని, పూర్తి పాటను దీపావళి రోజున విడుదల చేయనున్నట్టు చెప్పుకొచ్చారు.