ప్రేమలో విఫలం అయితే … పార్టీ చేసుకుంటా ?

Sunday, November 20th, 2016, 11:10:21 AM IST

alia
సాధారణంగా ఎవరైనా ప్రేమలో ఫెయిల్ అయితే ఎం చేస్తారు … దాన్ని తలచుకుని బాధపడుతూ ఉంటారు ? మగవాళ్లయితే … మందు వేసుకుని ఆ బాధను మర్చిపోవడానికి దేవదాస్ లా మారతారు !! అమ్మాయిలైతే .. లోలోపల కుమిలిపోతూ ఉంటారు ? కానీ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ మాత్రం … ఎంచక్కా ఎంజాయ్ చేస్తుందట !! విహారయాత్రలకు వెళ్తానని అంటుంది? అదేంటి … ఈమెకు ఎమన్నా పిచ్చా అని అనుకుంటున్నారా … కాదండి బాబు .. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది ? చిన్నతనంలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు సిద్దార్థ్ మల్హోత్రాతో ఘాటు ప్రేమాయణం సాగిస్తుంది. ఈమెకు ప్రేమలో పడడం ఇప్పుడు కొత్తేమి కాదు. కాలేజీ రోజులనుండి చాలా సార్లు ప్రేమలో పడి, బ్రేక్ అప్ కూడా అయిందట !! టీనేజ్ లో సాగించిన ఆ ప్రేమాయణాలు, విఫలం అయినప్పుడు ఆ బాధను మరచిపోయేందుకు ఫ్రెండ్స్ తో కలిసి విహారయాత్రలకు వెళ్ళేదట !! ఆబాధను తలచుకుంటూ ఇంట్లో కూర్చుంటే ఎలా … అందుకే దాన్ని మరచిపోవాలంటే ఇలా చేయడం కరక్ట్ అని సలహా కూడా ఇస్తోంది ?