RRR నుంచి ఆలియాభట్ తప్పుకోలేదట.. నిజమేనా..!

Tuesday, March 24th, 2020, 01:00:40 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో దర్శక దిగ్గజం రాజమౌళి గారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీం పాత్ర‌లో నటిస్తుండగా, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్‌లు నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా రిలీజ్ 2021 జనవరి 8వ తేదీకి వాయిదా పడడం, తాజాగా కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవడంతో సినిమా నుంచి ఆలియా భట్ తప్పుకుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమా కోసం ఆలియా పక్కా ప్లానింగ్ తో డేట్స్ ఇచ్చిందని, ప్రస్తుతం ఆమెకు ఇతర సినిమాలు కూడా ఉండడం ఆ డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఈ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆలియా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోలేదని రాజమౌళి ఎప్పుడు అడిగితే అప్పుడు షూటింగ్‌కి రావడానికి ఆలియా భట్ రెడీగా ఉందని టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో ఏది వాస్తవం అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు.