బ్లాస్టింగ్ అప్డేట్ : మరో సంచలనానికి తెర లేపనున్న ఇద్దరు హీరోలు!?

Tuesday, October 15th, 2019, 07:54:07 PM IST

గత కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ లో చాలా అరుదుగా జరిగే సంఘటన చోటు చేసుకుంది.ఒకే రోజున ఇద్దరు స్టార్ హీరోల సినిమా అనే మాటే సినీ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేసేది.కానీ అలాంటిది ఆ మాటను సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు నిజం చేసి చూపించేసారు.వచ్చే సంక్రాంతికే ఈ ఇద్దరి సినిమాలు రాబోతున్నాయని ముందే చెప్పారు కానీ ఒకే రోజున వస్తున్నామని ఒకే రోజు ప్రకటించే సరికి మాత్రం టాలీవుడ్ లో మరింత వేడి రాజుకుంది.

ఇప్పుడు ఇదే పెద్ద షాక్ అనుకుంటే ఈ ఇద్దరు మరో సంచలనానికి తెర లేపనున్నట్టు సినీ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తుంది.ఇప్పుడు ఈ ఇద్దరు నటిస్తున్న “అల వైకుంఠపురములో” మరియు “సరిలేరు నీకెవ్వరు” సినిమాల తాలూకా టీజర్ లు కూడా ఒకే రోజున విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.ఇదే కానీ జరిగితే ఇక ఆ రోజు సోషల్ మీడియాలో యుద్ధం ఎలా ఉంటుందో చెప్పలేము.మరి నిజంగానే ఈ రెండు సినిమాల టీజర్ లు ఒకే రోజు విడుదల అయితే అదెలా ఉండబోతుందో చూడాలి.