ఆమె మరణంపై బన్నీ ఎమోషనల్ ట్వీట్స్..!

Friday, July 3rd, 2020, 08:10:40 PM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాన్సులు అంటే ఒకప్పుడు యువత ఏ స్థాయిలో పడి చచ్చేవారో అందరికీ తెలుసు. ఓ రకంగా బన్నీ కు ఈ స్థాయి ఫాలోయింగ్ రావడానికి ప్రధాన కారణం మరియు అతనికి ఇపుడు ఉన్న ఫ్యాన్ బేస్ లో 90 శాతం మంది అతని డాన్సు ల వలనే అని చెప్పాలి.

అంతలా బన్నీ డాన్స్ మూమెంట్స్ ఇంపాక్ట్ కలిగించాయి. అయితే అల్లు అర్జున్ తెలుగు తెరకు పరిచయం అయ్యింది తన అద్భుతమైన డాన్స్ మూమెంట్స్ తో అని చెప్పాలి. హీరోగా కాకముందే మెగాస్టార్ చిరంజీవితో డాడీ సినిమాలో తన డాన్స్ స్టూడెంట్ గా బన్నీ ఆ చిత్రంలో కనిపిస్తాడు. బన్నీ అలా కనిపించే కొద్ది సేపే అదిరిపోయే స్టెప్పులు వేస్తాడు.

అలా బన్నీ ఆ చిత్రం కోసం బన్నీ స్టెప్పులు నేర్పించిన మొదటి గురువు సరోజ్ ఖాన్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. దీనితో బన్నీ చాలా ఎమోషనల్ అయ్యారు. అపుడు ఆమెతో పని చేసిన ఫోటోలను పెట్టి సంతాపం తెలిపారు. ఆమె మరణం తనని ఎంత గానో బాధించింది అని అలాంటి లెజెండరీ కొరియోగ్రాఫర్ తో తన మొదటి చిత్రం చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా అని తెలిపారు. అంతే కాకుండా ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఎల్లప్పుడూ ఆమె పట్ల తన గౌరవం ఉంటుందని చెప్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.