అల్లు అర్జున్ ని కదిలించిన వీడియో అదేనంట…?

Tuesday, February 11th, 2020, 12:15:20 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి అల వైకుంఠపురంలో చిత్ర విజయానందంలో మునిగితేలుతున్నారు. కాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజ హెగ్డే ల కలయికలో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురంలో… సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కాగా తమన్ అందించిన ఈ చిత్రంలోని పాటలు అన్ని కూడా ఇప్పటికి మంచి విశేషాదరణను సంపాదించుకున్నాయి. ఇకపోతే అభిమానులందరూ కూడా బయట సామాజిక మాంద్యమాల్లో ఈ పాటలతో టిక్ టాక్ వీడియో లు కూడా చేస్తున్నారు.

అయితే ఈ చిత్రంలోని బుట్టబొమ్మ పాటకు ఇద్దరు దివ్యాంగులు చేసిన టిక్ టాక్ వీడియోను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఇప్పటికే బుట్ట బొమ్మ పాత మీద చాలా వీడియో లు వచ్చినప్పటికీ కూడా తన హృదయాన్ని తాకినా వీడియో మాత్రం ఇదేనని, ఈ పాటలు ఇంత ఆదరణ సంపాదించుకోవడం చాలా ఆనందంగా ఉందని, వీరు చేసిన ఈ వీడియో ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని అభివర్ణించారు.