శాంటాక్లాజ్ గా అదరగొట్టిన అల్లు అర్జున్ తనయుడు!

Thursday, December 25th, 2014, 03:45:26 PM IST

Ayaan
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ కుమారుడు అయాన్ ఇప్పటి నుండే విశేష అభిమానుల్ని ఆకర్షిస్తున్నాడు. వివరాలలోకి వెళితే ఇటీవల బాలల దినోత్సవం సందర్భంగా చాచా నెహ్రూ వేషంలో అదరగొట్టిన అల్లు అర్జున్ కుమారుడు అయాన్ ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా రెడ్ అండ్ వైట్ శాంటాక్లాజ్ డ్రెస్ తో ఫోటో దిగి దుమారం రేపుతున్నాడు. ఇక క్రిస్మస్ సందర్భంగా అయాన్ ను శాంటాగా ముస్తాబు చేసి తీసిన ఫోటోను అల్లు అర్జున్ పేస్ బుక్ లో పెట్టగా, దానికి లైక్ ల మీద లైక్ లు రావడం విశేషం. కాగా ఇప్పటి నుండే ఈ జూనియర్ అల్లు వారసుడు తన ఫోటోలతో క్రేజ్ సృష్టించుకుని అభిమానుల మనసులను కొల్లగొట్టడం మొదలు పెట్టాడని పలువురు అభిప్రాయపడుతున్నారు .