వైరల్ అవుతున్న బన్నీ లేటెస్ట్ ఫోటో.!

Thursday, March 26th, 2020, 07:04:03 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన హిట్ డైరెక్టర్ సుకుమార్ తో ఓ సినిమాలో నటించనున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి ముందు నటించిన “అల వైకుంఠపురములో” భారీ హిట్టయ్యింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన త్రివిక్రమ్ తో బన్నీకు అది హ్యాట్రిక్ చిత్రం కావడం విశేషం.

అలాగే ఇప్పుడు సుకుమార్ తో తీస్తున్న మూడో చిత్రం కావడంతో దీనికి దానిని మించిన అంచనాలు ఏర్పడ్డాయి.అయితే ఇప్పుడు కరోనా కారణంగా అన్ని చిత్రాలతో పాటు ఈ సినిమా కూడా ఆగిపోయింది. కానీ ఈ చిత్రం కోసం బన్నీ ప్రిపేర్ చేసుకుంటున్న లుక్ మాత్రం మంచి హాట్ టాపిక్ అయ్యింది.

ఇదిలా ఉండగా బన్నీకు సంబంధించిన ఒక సరికొత్త ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కరోనా కారణంగా మాస్క్ వేసుకొని ఒక సూపర్ మార్కెట్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో బయటకు వచ్చి వైరల్ అవుతుంది. ఇందులో బన్నీ దేశముదురు స్టైల్ లో కనిపిస్తున్న ఈ ఫోటో చూసి మాత్రం బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ ఫీల్ అవుతున్నారు.