అలా పెట్టారో లేదో ఇలా రికార్డుని సెట్ చేశారు…ఇదంతా “అల్లు అర్జున్” మ్యానియా నా?

Wednesday, December 11th, 2019, 04:40:06 PM IST

ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే టీజర్ దిమ్మ తిరిగి బొమ్మ అదిరింది అని అంటున్నారు ప్రేక్షకులు. ఇది ఎలా వున్నా బన్నీ అభిమానులు మాత్రం టీజర్ తోనే పండగ చేసుకుంటున్నారు. టీజర్ విడుదల అయిన ఏడే ఏడూ నిమిషాల్లో మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకొని అలా కొత్త రికార్డుని సెట్ చేసింది. టీజర్ కే ఇలా రెస్పాన్స్ వస్తుందంటే, ట్రైలర్ కి ఇంకా ఏ రేంజ్ లో వస్తుందో ఉహించవచ్చు. కేవలం అల్లు అర్జున్ మాత్రమే తనకు తానుగా ఇలా రికార్డులని సెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు, అది కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో.

అలా వైకుంఠపురంలో చిత్రానికి థమన్ సంగీతం అదుర్స్ అని ప్రేక్షకులు అంటున్నారు. త్రివిక్రమ్-బన్నీ-థమన్ కాంబినేషన్ చాల అద్భుతంగా వుంది అంటూ ప్రేక్షకులు తమ అభిప్రాయాల్ని చెబుతున్నారు. ఈ చిత్రంలో పూజ హెగ్డే అల్లు అర్జున్ సరసన కథానాయికగా నటిస్తుంది.