బన్నీకి లైన్ క్లియర్ అయినట్టే ?

Friday, October 12th, 2018, 10:40:07 AM IST

దాదాపు ఐదునెలల పాటు నెక్స్ట్ సినిమా విషయంలో ఈలాంటి డెసిషన్ తీసుకోలేదు అల్లు అర్జున్. భారీ అంచలనతో విడుదలైన నా పేరు సూర్య సినిమాకు గట్టి ఎదురుదెబ్బ తగలడంతో నెక్స్ట్ సినిమా విషయంలో ఇంకా జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పటికే పలువురు దర్శకులు కథలు వినిపించినప్పటికీ ఎవరికీ అయన ఓకే చెప్పడం లేదు. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ కూడా కథ చెప్పి ఆల్మోస్ట్ ఓకే అనిపించేలోగా .. కథలో మసాలా తగ్గిందంటూ రిపేర్లు చేయమని చెప్పాడట. ప్రస్తుతం బన్నీ ఫోకస్ మొత్తం త్రివిక్రమ్ పైనే ఉంది. త్రివిక్రమ్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలను చేసిన బన్నీ .. హ్యాట్రిక్ హిట్ కోసం ఆయనకోసం ఎదురు చూస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ తో అరవింద సమేత తీసి సూపర్ హిట్ అందుకోవడంతో అల్లు అర్జున్ లైన్ క్లియర్ అయింది. త్రివిక్రమ్ కూడా అటు మహేష్, ఇటు వెంకటేష్ లతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు .. కానీ సరైన కథ కోసం అన్వేషణ సాగుతుంది. ఈ లోగా బన్నీకోసం మంచి స్క్రిప్ట్ కుదిరిందంటే ఆ సినిమా పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉంది.