ఆ దర్శకుడి విషయంలో ఆలోచనలో పడ్డ అల్లు అర్జున్ ?

Friday, June 8th, 2018, 12:40:53 AM IST

ఎన్నో ఆశలు పెట్టుకున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోవడంతో అల్లు అర్జున్ కాస్త నిరాశకు లోనయ్యాడు. ఈ సినిమాకోసం తన మేక్ ఓవర్ కూడా మార్చుకున్నాడు బన్నీ. అయితే నా పేరు సూర్య తరువాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేయాలన్న ఆలోచనలో పడ్డాడు. నిజానికి ఆయనతో సినిమాలు చేయడానికి కొరటాల శివ, సుకుమార్ లు చేయాలనీ ప్లాన్ చేసారు కానీ, ఈ లోగా కొరటాల చిరంజీవి తో, సుకుమార్ తో మహేష్ తో కమిట్ అవ్వడంతో అల్లు అర్జున్ కోసం కేవలం మనం ఫేమ్ విక్రమ్ కుమార్ మాత్రమే లైన్ లో ఉన్నాడు. తాజగా విక్రమ్ కుమార్ కూడా అల్లు అర్జున్ కు కథను చెప్పాడట .. ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా .. సెకండ్ హాఫ్ విషయంలో కుదరలేదట. దాంతో ఆలోచనలో పడ్డాడట బన్నీ. దాంతో కథలో మార్పులు చేసే పనిలో పడ్డాడట దర్శకుడు. మరో వైపు ఇతర దర్శకులతో కూడా చర్చలు జరిపేందుకు రెడీ అయ్యాడట బన్నీ. చూద్దాం ఏమి జరుగుతుందో.

  •  
  •  
  •  
  •  

Comments