అల్లు అర్జున్ ను ఆశ్చర్యానికి గురి చేసిన ఆ ఫ్లాష్ మాబ్ డాన్స్ చూసారా!?

Monday, July 20th, 2020, 11:12:35 PM IST

కరోనా వైరస్ మహమ్మారి భారత్ లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొందరు తమ శక్తి కి మించి విధులను నిర్వర్తిస్తున్నారు. అయితే ఇండిగో ఏర్ లైన్స్ భువనేశ్వర్ లో కండక్ట్ చేసిన ఫ్లాష్ మబ్ లో సిబ్బంది బుట్ట బొమ్మ పాటకు అద్భుతంగా డాన్స్ చేశారు. అయితే ఈ వీడియో చూసిన వెంటనే కొందరు నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. అయితే ఈ డ్యాన్స్ వీడియో పై అల్లు అర్జున్ తనదైన శైలి లో స్పందించారు.

ఈ వీడియో చాలా ఆశ్చర్యానికి గురి చేసింది అని, ఇలాంటి కఠిన సమయాల్లో ఇలా చేయడం చాలా గొప్ప విషయం గా భావిస్తున్నట్లు తెలిపారు. అయితే బుట్ట బొమ్మ పాట ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ ను సంపాదించుకుంది. భాష తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ పాటకు కి కొరియోగ్రఫీ అందించిన జాని మాస్టర్ ను, నటించిన అల్లు అర్జున్, పూజ హెగ్డే లను నెటిజన్లు ట్యాగ్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయం లో ఇలా చేయడం పట్ల నెటిజన్లు తమ బావలను షేర్ చేస్తున్నారు.