ఆ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర తెలిసిపోయింది ?

Monday, September 19th, 2016, 03:05:23 PM IST

allu-arjun
”సరైనోడు” విజయంతో మంచి ఊపుమీదున్న అల్లు అర్జున్ వెంటనే తన నెక్స్ట్ చిత్రాన్ని మొదలు పెట్టాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర ఏమిటో తెలిసింది. ఇందులో ”దువ్వాడ జగన్నాధం” అలియాస్ అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తాడని తెలిసింది. గతంలో ఎన్టీఆర్ కూడా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ”అదుర్స్” సినిమాలో చారి పాత్రలో అదరగొట్టాడు. నిజానికి ఆ ట్రాక్ రాసింది హరీష్ శంకరేనట, అప్పుడు హరీష్ ఘోస్ట్ రైటర్ గా ఆ సినిమాకు పనిచేశాడని తెలిసింది. ఆ పాత్ర స్ఫూర్తి తో అదే మాదిరిగా ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ పాత్ర ఎంటర్ టైనింగ్ గా సాగుతుందని తాజా సమాచారం . దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల ప్లాన్ చేసారు.