“పుష్ప” కోసం మరింత తగ్గిన బన్నీ.!

Sunday, July 26th, 2020, 08:13:17 PM IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ తో “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే తన ప్రతీ సినిమాకు ఒక సరికొత్త లుక్ ను పరిచయం చేసే బన్నీ ఈసారి కూడా ఒక రఫ్ లుక్ లో కనిపించి మరిన్ని అంచనాలు పెంచేసాడు.

అయితే బన్నీ తన నా పేరు సూర్య “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” చిత్రం కు బాగా బరువు పెరిగిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ దర్శకుడు త్రివిక్రమ్ తో చేసిన “అల వైకుంఠపురములో” కు చాలా బరువు తగ్గిపోయాడు. అప్పుడు మంచి స్లిమ్ లుక్ లో కనిపించిన బన్నీ ఇప్పుడు పుష్ప కోసం మరింత బరువు తగ్గాడట.

దాదాపు 8 కిలోల వరకు బన్నీ తగ్గి కసరత్తులు చేస్తున్నాడట. గత కొన్ని రోజుల కితమే ఈ సినిమా కోసం బన్నీ సిక్స్ ప్యాక్ లుక్స్ ను మళ్ళీ పరిచయం చేయనున్నాడని తెలుస్తుంది. మరి బన్నీ ఎలాంటి లుక్ లో కనిపించనున్నాడో చూడాలి. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.