అల్లు అర్జున్ స్టామినా అంటే ఇది… తెలుగులో ఆల్ టైం రికార్డు!

Saturday, October 19th, 2019, 11:42:01 AM IST

అల్లు అర్జున్ సినిమా అంటేనే యువతలో వుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అల్లు అర్జున్ తాజాగా అలా వైకుంఠపురంలో చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలోని ఒక పాటని చిత్ర బృందం విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పాట యువతని ఉర్రుతలూగిస్తుంది. ఈ పాటకు అత్యధిక లైక్స్ రావడం, అల్లు అర్జున్ ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలపడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ స్టామినా అంటే ఇది అని ఈ ఒక్క రికార్డు చాలు అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అల్లు అర్జున్ కి యూత్ లో చాల క్రేజ్ వుంది. అలా వైకుంఠపురం లో చిత్రం తో మళ్ళీ తానేంటో ప్రూవ్ చేసుకోవాలని ఆరాటపడుతూన్నారు. వరుస సినిమాలని చేస్తూ బిజీ గా గడపనున్నారు. ప్రతి విషయాన్నీ అల్లు అర్జున్ అభిమానులతో పంచుకుంటారు. సామజవరగమనా పాట 700k లైక్స్ సాధించడంతో ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. సినిమా విడుదల కాకుండానే ఇన్ని రికార్డులు కొల్లగొట్టిందంటే, విడుదల అయ్యాక ఈ చిత్రం మరెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి.