టాలీవుడ్ ట్రెండింగ్.. బ‌న్నీకి కూడా ఆ భామే కావాలంట‌..!

Thursday, November 1st, 2018, 12:34:11 PM IST

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ నటించిన గ‌త చిత్రం నా పేరు సూర్య బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ కావ‌డంతో, కొద్ది రోజులుగా ఎలాంటి ప్రాజెక్టులు ఓకే చేయ‌కుండా క‌థ‌ల వేట కొన‌సాగించాడు. అయితే తాజాగా త్రివిక్ర‌మ్ సినిమాకి ఓకే చెప్పాడు బ‌న్నీ. అర‌వింద స‌మేత చిత్రంతో మ‌ళ్లీ రేసులోకి వ‌చ్చిన త్రివిక్ర‌మ్ మ‌రోసారి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాడ‌ని.. ఆ క‌థ బ‌న్నీకి బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చేశాడ‌ని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో బ‌న్ని స‌ర‌స‌న హీరోయిన్‌గా కైరా అద్వాణిని సెలెక్ట్ చేశార‌ని స‌మాచారం.

భ‌రత్ అను నేను చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కైరా తొలి చిత్రంతోనే త‌న క్యూట్ ప‌ర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకుంది. దీంతో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్- బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రంలో న‌టిస్తుంది కైరా. దీంతో ఈ అల్లు వార‌బ్బాయ్ క‌న్ను ఈ క్యూట్ భామ పై ప‌డింది. ఈ క్ర‌మంలో తాజా చిత్రంలో కైరాను ప‌ట్టుబ‌ట్టి మ‌రీ త్రివిక్ర‌మ్‌ను ఒప్పించాడ‌ని తెలుస్తోంది. మ‌రి త్రివిక్ర‌మ్ చిత్రాల్లో హీరోయిన్ల క్యారెక్టర్స్ చాలా ఫ‌న్నీగా డిజైన్ చేస్తాడు. మ‌రి కైరా పాత్ర‌ను ఈ మాట‌ల మాంత్రికుడు ఎలా మ‌లుస్తాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments