సోషల్ మీడియాలో వింటేజ్ లుక్ తో అదరగొడుతున్న బన్నీ..!

Sunday, October 28th, 2018, 09:12:03 PM IST

టాలీవుడ్ లో స్టైల్ కి పెట్టింది పేరు అల్లు అర్జున్. ఎంత మంది హీరోలు ఉన్నా సరే అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఒక స్టైలిష్ మార్క్ ను సంపాదించుకొని “స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్” గా మారాడు.అయితే ప్రతీ సినిమాకి తన లుక్ ని మార్చుకుంటూ వస్తున్న బన్నీ నిన్న కర్ణాటక లోని జరిగినటువంటి ఒక సభలో మళ్ళీ తన పాత లుక్ తో కనబడి తన అభిమానులకు షాక్ ఇచ్చాడు.

దేశముదురు,ఆర్య 2,వేదం తదితర చిత్రాల్లో లాంగ్ హెయిర్ తో కనిపించిన బన్నీ మళ్ళీ కొత్త తరహా హెయిర్ స్టైల్ లను పరిచయం చేస్తూ బిజీగా ఉన్నాడు.అయితే నిన్నజరిగినటువంటి పురస్కార సభలో మళ్ళీ పాత లుక్ అదే లాంగ్ హెయిర్ లుక్ తో కనిపించి అభిమానులకు ఊహించని బహుమతిని ఇచ్చాడు.దీనితో సోషల్ మీడియాలో తమ అభిమాన నటుని యొక్క ఫోటోలను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.