దాసరి డైలాగ్ : చిత్ర పరిశ్రమ టార్గెట్‌ అయిపోయింది

Saturday, April 21st, 2018, 08:06:09 PM IST


ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికి తెలిసిందే. గత ఏడాది డ్రగ్స్ ఇష్యు నుంచి కత్తి మహేష్ – శ్రీ రెడ్డి వివాదాల వరకు ఇండస్ట్రీ గురించి అనేక రకాల నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. జాతీయ మీడియాల్లో తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదాలు తారా స్థాయికి చేరుతున్నాయి అనే తరహాలో నెగిటివ్ గా వార్తలు వెలువడ్డాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పై వచ్చిన ఆరోపణపై కూడా అనేక అనుమానాలు వచ్చాయి.

అయితే ఈ విషయంలో చాలా మంది సినీ ప్రముఖులు పవన్ కు మద్దతు పలికారు. మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ తో నడిచింది. ఇక అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ వినూత్న తరహాలో ఇండస్ట్రీ పై వస్తోన్న ఆరోపణలపై స్పందిస్తున్నాడు. ముఖ్యంగా దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ వీడియో ని పోస్ట్ చేశారు. అందులో దాసరి సినీ పరిశ్రమపై కొనసాగుతోన్న చిన్న చూపు పై తనదైన శైలిలో చెప్పారు. ముప్పై ఏళ్ల కిందట చెప్పిన ఆ సమాధానం ఇప్పటికి వర్తిస్తుంది. ఈ సమయంలో ఆయన మా దగ్గర లేరు. సినీ పరిశ్రమ అంటే అందరికి సాఫ్ట్ టార్గెట్ అయిపోయిందని, అందరు తప్పకుండా చూడాల్సిన వీడియో అంటూ శిరీష్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments