ఆ హీరోతో ఎఫైర్ లేదంటున్న అమలా ?

Tuesday, December 27th, 2016, 03:07:57 AM IST

amala
గ్లామర్ భామగా తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్ తెచ్చుకుంది మలయాళ కుట్టి అమల పాల్. ‘మైన’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ నాలుగైదు సినిమాలకే స్టార్ హీరోలతో జోడి కట్టింది. ఇక అంతే త్వరగా పెళ్లి చేసుకుని కొన్నాళ్ళు సినిమాకు దూరం అయిన ఈమే తన భర్త విజయ్ కి కూడా బ్రేక్ అప్ చెప్పింది. ప్రస్తుతం మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెట్టిన అమలకు వరుస అవకాశాలు క్యూ కట్టేశాయి. ఆ ఆనందంలో ఉండగానే హీరో ధనుష్ తో ఎఫైర్ నడిపిస్తుందంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. విడిపోయిన తరువాత ‘అమ్మ కనక్కు’ లాంటి సినిమాతో సప్పోర్ట్ ఇచ్చాడు ధనుష్ . ఆ తరువాత ‘వడా చెన్నై’, ‘విఐపి’ చిత్రాల్లో కూడా అమలా నటించింది. దాంతో వీరిద్దరి మధ్య ఎదో వ్యవహారం ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో .. ఈ రూమర్స్ ఎక్కువ కాకముందే క్లారిటీ ఇస్తే బెటర్ అని ఫీల్ అయినట్టుంది అమలా .. అందుకే వెంటనే ఈ రూమర్స్ పై స్పందించింది .. నా విడాకుల న్యూస్ తెలిసి.. నాకు ధనుష్ కు మధ్య లింకులు చేస్తూ వార్తలు రావడం చాలా దారుణం ? నా లైఫ్ విషయంలో తాను చాలా సహాయం చేసాడు, సినిమాలు కలిసి చేసినంత మాత్రానా మా మధ్య ఎదో ఉందని అనడం కరక్ట్ కాదు? ఇలాంటి వార్తలు నిజం కావు, మన సమాజంలో మహిళలను బ్లెమ్ చేయడం సర్వ సాధారణమే కదా అంటూ స్పందించింది. ఇలాంటి వార్తలను నేను ఖాతరు చేయనని గట్టిగానే చెప్పింది ?

  •  
  •  
  •  
  •  

Comments