అమ‌లాపాల్ ఘాటు బాగానే పెంచింది

Sunday, September 18th, 2016, 03:48:28 PM IST

amala-paul
ఇంట్లో ఎంత ఫ్రీడ‌మ్ ఇచ్చిన‌ప్ప‌టికీ పెళ్ళ‌య్యాక క‌థానాయిక‌ల తీరు మారుతుంది. అంత‌కుముందులా గ్లామ‌ర్‌గా క‌నిపించ‌లేరు. ఎవ‌రేమ‌నుకొంటారో అనే ఫీలింగ్‌. పాత్ర‌ల విష‌యంలోనూ కొన్ని ష‌ర‌తులు విధించాల్సి వ‌స్తుంటుంది. ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా హుందాత‌నంతో కూడిన పాత్ర‌లు చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతుంటుంది. పెళ్ళ‌య్యాక అమ‌లాపాల్ ప్ర‌యాణం కూడా ఇంచుమించు అలాగే సాగింది. ఎక్క‌డా హ‌ద్దులు దాటి క‌నిపించిన‌ట్టు అనిపించ‌లేదు. సినిమాల్లోనే కాదు, బ‌య‌ట ఫంక్ష‌న్ల‌కీ ఆమె ప‌ద్ధ‌తిగానే త‌యారై వ‌చ్చేది. అయితే ఇటీవల ఆమె పెళ్ళి పెటాకులైంది. డైవ‌ర్స్‌కి అప్లై చేసింది. ఇక‌పై మ‌ళ్లీ మునుప‌టిలాగా కెరీర్‌పై దృష్టిపెట్టాల‌ని నిర్ణ‌యించుకొంది. అవ‌కాశాలే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతోంది. సినిమా అవ‌కాశాలు రావాలంటే గ్లామ‌ర్ ప్ర‌ద‌ర్శించాల్సిస్తూ ప‌దిమందిని ఆక‌ర్షించాల్సిందే క‌దా! ఇప్పుడు అమ‌లాపాల్ అదే ప‌నిలో ఉంది. చిట్టిపొట్టి డ్రెస్సుల‌తో వేడుక‌ల‌కి హాజ‌ర‌వుతోంది. ఘాటుగా క‌నిపిస్తూ ఈమెలో అందం త‌గ్గ‌లేదు అనిపించుకొనే ప్ర‌య‌త్నం చేస్తోంది. నిన్న చెన్నైలో జ‌రిగిన సెల‌బ్రిటీ బ్యాడ్మింట‌న్ లీగ్ ప్రోగ్రామ్‌కి అమ‌లాపాల్ ఘాటు పెంచే డ్రెస్సును వేసుకొచ్చి ఫొటోగ్రాఫ‌ర్ల‌కి పోజులిచ్చింది. అక్క‌డ అంద‌రి దృష్టీ త‌న‌పైనే ఉండేలా చూసుకొంది. తెర‌పై ఇంకే రేంజులో అద‌ర‌గొట్ట‌బోతోందో ఊహించొచ్చు.