తనపై పుకార్లకు చెక్ పెట్టిన అమలా పాల్!

Tuesday, March 24th, 2020, 01:09:07 PM IST

ఏ ఇండస్ట్రీలో అయినా సరే పుకార్లకు కొదవ ఉండదు. అసలు ఒక విషయం నిజమో కాదో పూర్తి అవగాహనా లేకుండా వార్తలు ప్రచారం చేస్తుంటారు. కోలీవుడ్ చాక్లెట్ బ్యూటీ అమలాపాల్ తమిళ్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ తో 2014లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.కానీ తమకు మళ్ళీ సెట్ అవ్వక విడాకులు తీసుకొని ఎవరి జీవనం ఎవరు గడుపుతున్నారు.

అయితే ముంబైకు చెందిన గాయకుడు భవీందర్ సింగ్ తో పెళ్లి అయ్యిపోయిందని ఆమెకు చెందిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యుపోయాయి. అయితే తనపై ఇలా వైరల్ అవుతున్న పుకార్లకు అమలా చెక్ పెట్టినట్టు తెలుస్తుంది.తాను అతనితో ఫోటోలు దిగిన మాట వాస్తవం కానీ మాకు ఇంకా పెళ్లి కాలేదు కానీ అది జస్ట్ ఫోటో షూట్ మాత్రమే అని పెళ్లి లాంటిది తాను చేసుకోలేదని అమలా క్లారిటీ ఇచ్చింది.