అగ్గి రాజేస్తున్న టీవీ యాంక‌ర్

Saturday, February 9th, 2019, 08:00:52 PM IST

ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ఐడెంటిటీ తెచ్చుకున్న లండ‌న్ బ్యూటీ ఎమీజాక్స‌న్. ఈ అమ్మ‌డు ఎంద‌రికో స్ఫూర్తి నింపుతోంది. ఈ బ్రిటీష్ గాళ్‌ బాట‌లోనే ఎంద‌రో టాప్ మోడ‌ల్స్ ఇండియ‌న్ సినిమాల్లో న‌టించేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే ప‌లువురు టాప్ మోడ‌ల్స్ బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో న‌టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌నోహ‌రి నోరా ఫ‌తేహి ఇదే త‌ర‌హాలో బాలీవుడ్, సౌత్ ఇండ‌స్ట్రీలో త‌న క‌ల‌ల్ని నిజం చేసుకునేందుకు ఐదారేళ్లుగా తీవ్రంగానే శ్ర‌మిస్తోంది. ప‌లు దేశాల నుంచి వ‌చ్చిన మోడల్స్ రంగుల ప్ర‌పంచంలో క‌ల‌ల్ని నిజం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అదే బాట‌లో అమెరిక‌న్ టాప్ మోడ‌ల్, టీవీ హోస్ట్ ఆజా డాంగ్ బాలీవుడ్ సినిమాల్లో ప్ర‌య‌త్నిస్తోందిట‌. ఆజాను కు సోష‌ల్ మీడియాలో బోలెడంత పాలోయింగ్ ఉంది. ఇన్ స్టాగ్ర‌మ్ లో ఏకంగా 160కె ఫాలోవ‌ర్స్ అనుస‌రిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే ప్ర‌య‌త్నాలు సీరియ‌స్ గానే సాగిస్తోందిట‌. రెగ్యుల‌ర్ గా బికినీ ఫోటోషూట్స్ స‌హా ర‌క‌ర‌కాల ఫోజుల్లో ఫోజులిస్తూ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోంది. అందులోంచి మ‌చ్చుకు కొన్ని ఫోటోలు యూత్ లో జోరుగా వైర‌ల్ అయిపోతున్నాయి.