షాక్ .. నన్ను వాడుకోవాలని చూశారంటున్న హీరోయిన్ ?

Thursday, October 11th, 2018, 03:43:29 PM IST

మొత్తానికి కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఓ రేంజ్ లో ఊపందుకుంది. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ ఈ విషయంలో దైర్యంగా తమకు జరిగిన అవమానాలకు బహిరంగంగా చెప్పేస్తూ పలువురికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ముక్యంగా మీ టూ అంటూ ఇది ఓ ఉద్యమం లా మారింది. ఈ ఉద్యమమని పలువురు నటీమణులతో పాటు హీరోలు కూడా సపోర్ట్ అందించడం విశేషం. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా ఘాటుగా స్పందించింది. తనను కూడా వాడుకోవాలని చూశారంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో సినెమాలు చేసిన అమైరా దస్తూర్ ? తన కెరీర్ కొత్తలో కొంత మంది నిర్మాతలు నన్ను వాడుకోవాలని చూశారంటూ చెప్పింది. హిందీలోనే కాదు సౌత్ లోను ఇలాంటి అనుభవం తనకు ఎదురైందని, హిందీలో ఓ నిర్మాత .. తనకు కావలసినది ఇస్తే .. మూడు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పాడని .. కానీ నేను వాటికి లొంగలేదని చెప్పింది. మొత్తానికి అమైరా కామెంట్స్ తో ప్రస్తుతం బి టౌన్ తో పాటు సౌత్ లోను ప్రకంపనలు లేస్తున్నాయి. అమీరా దస్తూర్ తమిళ తెలుగు భాషల్లో ధనుష్ సరసన అనేకుడు సినిమాలో నటించింది. ఈ మద్యే రాజ్ తరుణ్ తో కలిసి రాజుగాడు, మహేష్ అక్క మంజుల దర్శకత్వంలో మనసుకు నచ్చింది సినిమాల్లో నటించింది.