గెటప్ చేంజ్ చేసిన యాంకర్ అనసూయ.. లుక్ అదిరిందిగా..!

Saturday, June 20th, 2020, 01:18:47 AM IST


జబర్దస్థ్ యాంకర్ అనసూయ తన గెటప్ పూర్తిగా చేంజ్ చేసేసింది. దాదాపు మూడు నెలల తరువాత షూటింగ్‌లు తిరిగి ప్రారంభమవుతున్న నేపధ్యంలో అనసూయ పూర్తి ట్రెండీ లుక్‌లోకి మారింది.

తన హెయిర్ భుజాల వరకు కట్‌చేసి, రింగులు తిప్పి బ్రౌన్ కలర్ వేసుకుంది. అయితే ఆమె మేకప్, హెయిర్ స్టైల్ చూస్తుంటే హాలీవుడ్ అమ్మాయిలా కనిపిస్తుంది. అయితే తనకు ఈ కొత్త లుక్ తీసుకొచ్చిన హెయిర్ స్టైలిస్ట్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ సచిన్ డకోజికి అనసూయ కృతజ్ఞతలు తెలుపుతూ తన కొత్త లుక్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఏదేమైనా అనసూయ కొత్త లుక్ అదిరిపోవడంతో నెటిజన్లు కూడా ఈ లుక్‌పై రకరకాల కామెంట్లు పెడుతున్నారు.