ఆ సినిమాపై అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన యాంకర్ సుమ..!

Wednesday, May 27th, 2020, 01:55:50 AM IST

తెలుగులో ఎన్నో టీవీ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాంలతో పాటు, సినిమా పాటల ఆడియో రిలీజ్ కార్యక్రమాలలో కూడా యాంకరింగ్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి పేరు సంపాదించుకుంది యాంకర్ సుమ.

అయితే కళ్యాణ ప్రాప్తిరస్తు, వర్షం, ఢీ, బాదుషా, స్వయంవరం, గీతాంజలి, రావోయి చందమామ, స్వరాభిషేకం వంటి సినిమాలలో సుమ నటించినప్పటికి సినిమాల కన్నా యాంక‌రింగ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టడంతో ఆ రంగంలో సుమ నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచింది. అయితే తాజాగా సుమ మళ్ళీ సినిమాలలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వలో వస్తున్న పుష్ష‌ అనే మూవీలో ఆమె ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై సుమ స్పందిస్తూ అలాంటిదేం లేదని ఖరాఖండీగా తేల్చేసింది. ఇక ఈ సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా సుమ నటిస్తుందన్న వార్తలలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పేశారు.