బన్నీ పుష్ప లో కీలక పాత్రలో కనిపించనున్న యాంకర్ సుమ!

Monday, May 25th, 2020, 05:06:45 PM IST


అల్లు అర్జున్ పుష్ప చిత్రం కోసం అన్ని రకాలుగా చిత్ర యూనిట్ ఫోకస్ చేస్తుంది. ఎన్నడూ లేని విధంగా యాంకర్ సుమ బన్నీ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రం నుండి విడుదల అయిన బన్నీ ఫస్ట్ లుక్ చూస్తేనే, చిత్తూరు జిల్లాలో లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు అని తెలుస్తోంది. ఇందులో బన్నీ ఎర్ర చందనాలు స్మగ్లింగ్ చేసే పాత్రలో, లారీ డ్రైవర్ గా కనిపించనున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ విషయంలో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు కొత్తగా యాంకర్ సుమ ఈ చిత్రం లో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది

అయితే ఈ చిత్రంలో సుమ అల్లు అర్జున్ కు సోదరిగా నటించనున్నారు అని తెలుస్తోంది. అంతేకాక ఈ చిత్రానికి సుమ పాత్ర చాలా కీలకం అని సినీ వర్గాల్లో ఇపుడు హాట్ టాపిక్ అయింది. అయితే దీని పై క్లారిటీ రావాల్సి ఉంది. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం ఇది. ఇందులో జగపతి బాబు, అనసూయ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా మొదటిసారి రశ్మిక మందాన్నా నటించనుంది. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ పాన్ ఇండియన్ సినిమా గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరి కొన్ని వివరాలు పూర్తి స్థాయిలో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.