లైంగిక వేధింపుల ఇష్యూ.. మీరు అవ‌కాశాల కోసం ప‌డ‌క‌గ‌దికి వెళ్ళ‌కండి..!

Friday, October 19th, 2018, 02:36:07 PM IST

దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం మీ..టూ ఉధ్య‌మం సంచ‌ల‌నం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. మీ..టూ ఉధ్య‌మం దెబ్బ‌కి తాజాగా కేంద్ర‌మంత్రి ఎంజే అక్బ‌ర్ బుధ‌వారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఉధ్య‌మం ద్వారా మ‌హిళ‌లు చేస్తున్న ఆరోప‌ణ పై బిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కొంద‌రు స‌మ‌ర్ధిస్తుంటే.. మ‌రికొంద‌రు ఎప్పుడో ఏళ్ళ క్రితం జ‌రిగితే ఇప్పుడు ఆరోపించ‌డం ఏంట‌ని వారిని వ్య‌తిరేకిస్తున్నారు.
అయితే తాజాగా త‌మిళ న‌టి ఆండ్రియా మీ..టూ పై స్పందించారు.

ధ‌నుష్ హీరోగా తాజాగా ఆమె న‌టించిన వ‌డ‌చెన్నై చిత్రం విడుద‌ల అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో మీడియా ముందుకు వ‌చ్చిన ఆండ్రియా సినీ లైంగిక వేధింపుల‌ పై స్పందించ‌మ‌ని కోర‌గా..అమ్మాయిల అంగీకారం లేకుండానే మ‌గ‌వారు ప‌డ‌క‌గ‌దికి పిలుస్తున్నారా.. అని ప్ర‌శ్నించింది. అయితే మీ..టూ ఉధ్య‌మాన్ని స్వాగ‌తిస్తున్నాన‌ని.. మీ..టూకి నా మ‌ద్ద‌తు ఉంటుందని ఆండ్రియా చెప్పింది. అవ‌కాశాల‌కోసం ప‌డ‌క గ‌దికి వెళ్ళ‌డం అనేది అమ్మాయిల చేతుల్లోనే ఉంద‌ని.. మీరు మిమ్మ‌ల్ని.. మీ ప్ర‌తిభ‌ను న‌మ్ముకుంటే ప‌డ‌క‌గ‌దికి వెళ్ళ‌ర‌ని.. నేను మాత్రం ఇప్ప‌టికి వ‌ర‌కు ఎవ‌రి ప‌డ‌క‌గ‌దికి వెళ్ళ‌కుండా మంచి చిత్రాల్లో న‌టించాన‌ని ఆండ్రియా చెప్పింది. దీంతో ఆండ్రియా వ్యాఖ్య‌లు.. లైంగిక వేధింపుల పై ఆరోప‌ణ‌లు చేస్తున్న వారికి పెద్ద షాకే అని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments