అరుదైన గౌరవం దక్కించుకున్న త్రివిక్రమ్ ?

Sunday, November 6th, 2016, 03:09:09 PM IST

trivikram
టాలీవుడ్ లో క్రేజీ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ తో సినిమా మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా నిన్న హైద్రాబాద్ లో మొదలైంది. ఇక త్రివిక్రమ్ సినిమాలన్నా, అయన డైలాగ్స్ అన్నా ప్రేక్షకులు తెగ ఆసక్తి కనబరుస్తారు. ఇప్పుడు అయనకు తెలుగు చిత్రసీమలో ఎవరికీ దక్కని గౌరవం దక్కింది? అవును .. అయన పేరుతొ .. ఓ ఆండ్రాయిడ్ ఆప్ రూపొందిస్తున్నారు. దానితో పాటు ”త్రివిక్రమ్ సెల్యూలాయిడ్”. ఇన్ పేరుతొ రూపొందిస్తున్నారు. ఏబీసీ డిజిటల్ మీడియా ఈ యాప్ ను రూపొందిస్తుంది. కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న త్రివిక్రమ్ పుట్టిన రోజు కానుకగా ఈ నెల 7 న విడుదల చేయనున్నారు. త్రివిక్రమ్ సినిమాలకు సంబందించిన వివరాలతో పాటు అయన వివరాలు తెలుసుకోవచ్చు. మొత్తానికి త్రివిక్రమ్ క్రేజ్ మరోసారి ఈ యాప్ ద్వారా వెల్లివిరిసింది.